పండక్కి పిచ్చెక్కించేలాగా కనబడుతున్నారు

వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ విడుదలకు సర్వం సిద్ధం. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు [more]

Update: 2019-01-08 04:01 GMT

వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ విడుదలకు సర్వం సిద్ధం. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నా ఈ సినిమా ప్రీమియర్స్…. జనవరి 11న అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ లో వెంకీ, వరుణ్‌ తోడల్లుళ్ల పాత్రల్లో సందడి చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను కాస్త లెట్ గానే విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఎఫ్ టు ట్రైలర్ చూస్తూంటే దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి ఎంటర్ట్నైమెంట్ ని నమ్ముకుని సినిమాను తెరకెక్కించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో డైలాగులు కాస్త వెటకారంగా రాసారని తెలుస్తోంది.

వెంకటేష్ వయసుకు తగిన పాత్రలో కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయాడు. ట్రైలర్ మొదలవ్వడమే… చివరిగా నవ్వుకుని తాళికట్టు నాయనా…అని పెళ్ళిలో పురోహితుడు అనడంతో పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న వెంకటేశ్‌ షాక్‌తో చూసే సీన్‌ అదిరింది. ఎప్పుడు కోపంతో చిటపటలాడే… భార్య తమన్నా ని చూసి ఫ్రస్టేషన్ కి గురవుతుంటారు. ఇక రెండో హీరో వరుణ్ తేజ్…. మెహరీన్‌ను ఇంప్రెస్‌ చేయడానికి కష్టపడుతూ కనిపించాడు. ఇంకా ఈ ట్రైలర్ లో మజాక్‌ చేస్తున్నావా? అని వెంకీని వరుణ్‌ అడిగితే.. నవ్వేమన్నా నా తోడల్లుడివా?, మజాక్‌ చేయడానికి అని వెంకటేష్.. వరుణ్ వెంటనే…. కాలం కలిసి వస్తే అవుతానేమో..అనే డైలాగ్స్ వున్నాయి.


ఇక ప్రియదర్శి కామెడీ కాస్త ఆకట్టుకునేలా కనబడుతుంది. ఇద్దరు హీరోయిన్స్ గ్లామర్ తో ఇరగదీసారు. ఇక వెంకటేష్ కామెడీ టైమింగ్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ చూడగలుగుతున్నారు అభిమానులు .ఫన్ గా సాగే సీన్స్‌, డైలాగ్స్‌తో ట్రైలర్‌ను చక్కగా కట్ చేసింది ఎఫ్ టు బృందం. మరి ఈ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే నిర్మాత దిల్ రాజు హిట్ కొట్టేసాలా కనబడుతుంటే… తోడల్లుళ్లు మాత్రం ఈ పండక్కి కడుపుబ్బా నవ్వించేమాదిరి కనబడుతున్నారు.

Tags:    

Similar News