ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నిజంగానే ఫన్ అండోయ్!

Update: 2018-07-11 04:55 GMT

వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే మల్టి స్టారర్ లో నటిస్తున్నారు. నిన్నగాక మొన్న పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ లు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే వెంకటేష్ తో పాటుగా దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజు తమ్ముడు లక్ష్మణ్ ఉన్న ఫోటో ఒకటి సెట్స్ మీద నుండి దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అక్కడ వెంకీ లుంగీ షర్ట్ వేసుకుని కాస్త ఫన్నీగానే కనిపించాడు. ఇక తాజాగా వరుణ్ తేజ్ తో పాటుగా ఈ సినిమాలో నటిస్తూన్న హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లు కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అయిన విషయాన్నీ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక ఆ ఫొటోలో మూవీ టీమ్ లో చాలామంది విజయ దరహాసం చేస్తూ సోఫా లో కూర్చున్నారు.

మరి ఆ పిక్ చూస్తుంటే నిజంగానే ఈ సినిమా లో భీభత్సమైన ఫన్ ఉంటుందనేది స్పష్టమైంది. మరి వెంకటేష్, వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లుగా ఈ సినిమాలో ఫన్ క్రియేట్ చెయ్యబోతున్నారనేది ప్రచారం లో ఉన్న న్యూస్. ఇక వెంకటేష్ సరసన తమన్నా..... వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ లు మొదటిసారిగా జోడి కడుతున్నారు. ఇకపోతే ఈ కామెడీ ఎంటర్టైనర్ ని దిల్ రాజు నిర్మిస్తుండగా... ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్నాడు. ఇప్పుడు ముచ్చటగా ఈ నాలుగో సినిమాతో కూడా హిట్ అందుకోవాలనుకుంటున్నాడు

Similar News