ఎఫ్2' పాత సినిమా నుండి కాపీనా?

Update: 2018-12-20 04:50 GMT

ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన హిట్ కొట్టేది మేమె అంటున్నారు 'ఎఫ్2' యూనిట్. సంక్రాంతికి ఫ్యామిలి ఎంటెర్టైనెర్స్ బాగా ఆడతాయని ఈ సీజన్ కు ఇదే బెస్ట్ ఛాయస్ అని చెబుతున్నారు. వెంకటేష్ - వరుణ్ లు మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా 'ఎఫ్2' ఒక పాత తెలుగు సినిమా లైన్ నుంచి స్ఫూర్తి పొందిందనేది సమాచారం.

1991లో పిఎన్ రామచంద్రరావు దర్శకత్వం వహించిన 'ఇంట్లో పిల్లి వీధిలో పులి' అనే సినిమా నుండి లైన్ తీసుకుని ఈసినిమాను చెక్కినట్టు వినికిడి. ఇందులో మిడిల్ ఏజ్ పాత్రలో చంద్రమోహన్, యువకుడిగా సురేష్ నటించి మంచి కామెడీ ను పంచుతారు. వీరు బయట విర్రవీగుతూ ఇంట్లో పెళ్ళాం చెప్పినట్టు వింటూ నానా అగచాట్లు పడుతుంటారు. అప్పటిలో ఇది డీసెంట్ హిట్. మంచి కామెడీ ఉండడంతో జనాలు దీన్ని యాక్సిప్ట్ చేశారు.

కరెక్ట్ గా అదే పాయింట్ తో అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' ను తీసాడని తెలుస్తుంది. ఇందులో కూడా వెంకీ - వరుణ్ లు ఇంట్లో పెళ్ళాలని తట్టుకోలేక ఏమి చేశారనేదే 'ఎఫ్ 2 ' కథ. తమన్నా, మెహ్రీన్ గ్లామర్లను వాడుకునేలా అనిల్ రావిపూడి చాలా మార్పులు చేసాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి కామెడీ డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. కచ్చితంగా ఈసినిమా సంక్రాంతి రేస్ లో విన్ అవుతుందని ఆశిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Similar News