రైల్వే కూలీలుగా వెంకీ... వరుణ్..!

Update: 2018-11-03 09:42 GMT

వరుణ్ తేజ్ - వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రేస్టేషన్ అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ లు తోడల్లుళ్లుగా కనబడబోతున్నారనే టాక్ ఉంది. ఇక వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. మరి సినిమా మొత్తం కామెడీ తో కూడిన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వరస ప్లాప్స్ లో ఉన్న దిల్ రాజు ఈ ఎఫ్ 2 సినిమా హిట్ మీదే ఆశలు పెట్టుకున్నాడు.

రైల్వే కూలీలుగా ఇద్దరు హీరోలు

ఇకపోతే అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబందించిన ఒక ఫోటోని పోస్ట్ చేసాడు. ఆ ఫోటో ని చూస్తుంటే వరుణ్ తేజ్ ఇంకా వెంకటేష్ లు రైల్వే కూలీలుగా ఈ సినిమాలో కనబడబోతున్నారా..? లేదంటే ఏదైనా ఒక సీన్ కోసం వారు ఈ కూలీ అవతారమెత్తారా..? అనే అనుమానం వస్తుంది. మరి కూలీ నెంబర్ 1 లో వెంకటేష్ పూర్తి స్థాయి రైల్వే కూలీ పాత్రలో అదరగొట్టాడు మరి ఈ సినిమాలో కూలీలుగా వరుణ్ అండ్ వెంకీ లు ఎలా నవ్వించబోతున్నారో అనే ఆసక్తి మాత్రం ఇప్పుడు ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించాడు.

Similar News