మల్టీస్టారర్స్ తో పిచ్చెక్కించేలా ఉన్నాడుగా

చాలాకాలంగా ఫ్యామిలీ చిత్రాలకు, తన ఏజ్ కి తగిన కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న వెంకటేష్… గత ఏడాది బాగా గ్యాప్ తీసుకుని.. వరుణ్ తేజ్ తో [more]

Update: 2019-03-20 04:39 GMT

చాలాకాలంగా ఫ్యామిలీ చిత్రాలకు, తన ఏజ్ కి తగిన కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న వెంకటేష్… గత ఏడాది బాగా గ్యాప్ తీసుకుని.. వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే సినిమా చేసాడు. మొదట్లో ఈ మల్టీస్టారర్ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. టీజర్ వదిలాక సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడం… ఇక ఈ సినిమా విడుదలయ్యాక పెద్ద సినిమాలన్నీ ప్లాప్ అవడంతో.. ఎఫ్ 2 కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఎఫ్ 2 లో వెంకటేష్ కామెడీ టైమింగ్ అదుర్స్, వరుణ్ తో కలిసి చేసిన కామెడీ హిలేరియస్ గా పండడంతో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మళ్ళి వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి వెంకీ మామా అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకూడా కామెడీ ఎంటెర్టైనెర్ గానే తెరకెక్కుతుందనే టాక్ ఉంది.

ఇక తాజాగా మరో మల్టీస్టారర్ కి వెంకటేష్ రెడీ అవుతున్నదని.. త్వరలోనే మరో హీరోతో కలిసి వెంకటేష్ ఆ మల్టీస్టారర్ మొదలెట్టబోతున్నాడని అంటున్నారు. అయితే మళ్ళీ దిల్ రాజు బ్యానేర్ లో అనిల్ డైరెక్షన్ లో చేసే ఎఫ్ 3 కాకుండా.. లేటెస్ట్ గా వెంకీ -రవితేజ కాంబోలో బిందాస్ ఫెమ్ వీరు పొట్లా దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ ని తెరెక్కించే ప్రయత్నాలు మొదలయినట్లుగా తెలుస్తుంది. ఇంకా స్క్రిప్ట్‌పై చర్చలు జరుగుతున్నాయట. మరి కొన్ని వారాల్లో సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా, అలాగే సంతోష్ శ్రీనివాస్ తో మరో చిత్రం చేస్తున్నాడు. మరి ఈ లోపు వెంకటేష్ కూడా చైతు తో వెంకిమామ పూర్తి చేసేస్తాడని.. ఆ వెంటనే వీరు పోట్ల దర్శకత్వంలో ఈ వెంకీ – మాస్ రాజాల మల్టీస్టారర్ పట్టాలెక్కుతోంది ఫిలింనగర్ టాక్

Tags:    

Similar News