వీక్ డేస్ లో వీకయిన మామాఅల్లుళ్లు!

శుక్రవారం విడుదలైన వెంకిమామ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు. ఈ మూడు రోజుల కలెక్షన్స్ తో వెంకిమామ చాలా వరకు సేఫ్. మూడు రోజులు [more]

Update: 2019-12-17 06:46 GMT

శుక్రవారం విడుదలైన వెంకిమామ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు. ఈ మూడు రోజుల కలెక్షన్స్ తో వెంకిమామ చాలా వరకు సేఫ్. మూడు రోజులు కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు వెంకిమామ కి తొందరగానే బ్రేక్ ఈవెన్ చేరుతుందని అంచనా వేశారు. కానీ వీక్ డేస్ లో వెంకిమామ కలెక్షన్స్ డ్రాప్ కనబడుతుంది. మండే వెంకిమామ వసూళ్లు బాగా పడిపోయాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు కూడా చాలా పల్చగా కనబడ్డారు. దీనితో సోమవారం వెంకిమామ రెండున్నర కోట్ల తోనే సరిపెట్టుకుని.. మొత్తం నాలుగు రోజులకు గాను రెండు రాష్ట్రాల్లో వెంకిమామ 19.44 వసూళ్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 7.52
సీడెడ్ 3.34
నెల్లూరు 0.71
కృష్ణ 1.17
గుంటూరు 1.62
వైజాగ్ 2.60
ఈస్ట్ గోదావరి 1.57
వెస్ట్ గోదావరి 0.91

టోటల్ ఏపీ & టీస్ షేర్: 19.44

Tags:    

Similar News