షాకిచ్చారు సరే…. వర్కౌట్ అవుతుందా?

ఎట్టకేలకు వెంకిమామ విడుదల డేట్ లాక్ చేసారు. సురేష్ బాబు వెంకిమామ విడుదల డేట్ పై సస్పెన్స్ చివరికి వెంకటేష్ బర్త్ డే డిసెంబర్ 13 న [more]

Update: 2019-12-03 05:58 GMT

ఎట్టకేలకు వెంకిమామ విడుదల డేట్ లాక్ చేసారు. సురేష్ బాబు వెంకిమామ విడుదల డేట్ పై సస్పెన్స్ చివరికి వెంకటేష్ బర్త్ డే డిసెంబర్ 13 న సినిమా విడుదల అంటూ దగ్గుబాటి రానాతో చెప్పించారు. రానా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటే… ఫోన్ లో SMS లు డిస్టర్బ్ చెయ్యడం, రానా అవేమిటా అని ఫోన్ ఓపెన్ చేసి చూడగా ఫ్యాన్స్ అంతా వెంకీ మామా రిలీజ్ డేట్ ఎప్పుడు మామా అంటూ ప్రశ్నించడంతో.. రానా కారెక్కి రామానాయుడు స్టూడియోస్ కి వెళ్లగా అక్కడ దర్శకుడు బాబీ వెంకిమామ సినిమాలో సీన్స్ చూస్తుంటే. రానా నేరుగా బాబీ దగ్గరకి వెళ్లి…. సినిమా హడావిడే కానీ రిలీజ్ డేట్ ఎమన్నా ఇస్తారా అంటే… వెంకిమామ ట్రైలర్ కట్ చేస్తున్నాం, అయినా విడుదల తేదీ గురించి చెబితే నిర్మాత సురేష్ బాబు గారేమంటారో అనగా.. రానా నాకు చెవులో చెప్పు అంటే దానికి బాబీ రానా చెవిలో వెంకిమామా రిలీజ్ డేట్ చెప్పడం… అది కాస్త రానా రివీల్ చెయ్యడం ఇలా కాస్త ఫన్నీగానే ప్రమోట్ చేస్తూ రిలీజ్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.

మరి నిన్నమొన్నటివరకు వెంకిమామ పోస్టర్స్, సాంగ్ లిరిక్స్ మాత్రమే బయటికి వచ్చాయి. సడన్ గా డిసెంబర్ 13 సినిమా విడుదల అంటే… ఈ ప్రమోషన్స్ సినిమా మీద క్రేజ్ తేవడానికి ఏం పనికొస్తుంది. ఇంకా టీజర్ బయటికి రాలేదు, పూర్తిగా సాంగ్స్ వదల్లేదు, అలాగే ఎక్కడా సినిమా మీద హడావిడి హైప్, క్రేజ్ లేదు.. అలాంటి టైం లో వెంకిమామ సినిమా విడుదలకు కేవలం 10 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ 10 రోజుల్లో ట్రైలర్ రిలీజ్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ రోజుకొకటి చొప్పున హడావిడి చేస్తేనే గాని సినిమాకి క్రేజ్ రాదు. అసలే వెంకిమామ మీద బోలెడన్ని రూమర్స్ ఉన్నాయి. బడ్జెట్ పరిధి దాటడం, హీరోలు చైతు, వెంకీలు పారితోషకాల త్యాగాలు, బాబీ తెరకెక్కించిన కొన్ని సీన్స్ రీ షూట్స్ అంటూ ప్రచారం జరగడంతో.. సినిమా మీద క్రేజ్ తగ్గింది. మరి సినిమా మీద క్రేజ్ రావాలంటే కేవలం ప్రమోషనే దిక్కు. ఉన్న షార్ట్ టైం లో ఎంత గట్టిగా సినిమా ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తారో చూడాలి.

Tags:    

Similar News