కొకా కోలా పెప్సీ.. మామ అల్లుడు కొంచెమే సెక్సీ..

బాబీ దర్శకత్వంలో వెంకటేష్ – నాగ చైతన్య మామాఅల్లుళ్లుగా నటించిన వెంకిమామ నిన్న శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దగ్గుబాటి అభిమానులకు, అక్కినేని అభిమానులకు మెచ్చే [more]

Update: 2019-12-14 05:51 GMT

బాబీ దర్శకత్వంలో వెంకటేష్ – నాగ చైతన్య మామాఅల్లుళ్లుగా నటించిన వెంకిమామ నిన్న శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దగ్గుబాటి అభిమానులకు, అక్కినేని అభిమానులకు మెచ్చే చిత్రమైన… మిగతా ప్రేక్షకులకు అంతగా ఎక్కని సినిమా వెంకిమామ అంటూ రివ్యూ రైటర్స్ తేల్చేశారు. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది… వెంకటేష్ పాత్ర అందరిని ఆకట్టుకున్నప్పటికీ.. హీరోయిన్స్ నామమాత్రపు పాత్రలు, మ్యూజిక్, సెకండ్ హాఫ్ ఎమోషన్, కథ రొటీన్ గా ఉండడం, కథనం బావున్నప్పటికీ… ఎమోషన్ పండకపోవడం సినిమాకి మైనస్. ప్రీ క్లైమాక్స్ కానీ, చైతు మిలటరీ సన్నివేశాలు కానీ, హీరోయిన్స్ తో కామెడీ ట్రాక్ కానీ ఆకట్టుకోలేకపోవడంతో.. క్రిటిక్స్ అంతా వెంకిమామ పై సెటైర్స్ వేస్తున్నారు.

వెంకిమామ సాంగ్ లో అన్నట్టుగా… కొకా కోలా పెప్సీ.. మామ అల్లుడు కొంచెమే సెక్సీ..అంటున్నారు. అలాగే బోరింగ్ మామ.. అని ఒకళ్ళంటే.. మరొకరు రెగ్యులర్ డ్రామా అని వేరొకరు పరమ రొటీన్ అని అంటున్నారు. కొన్ని కామెడీ సీన్స్, చైతు – వెంకీ కాంబో సీన్స్ కూడా పర్వాలేదు కానీ… వెంకీ మామ.. కొత్తగా లేడమ్మా అంటూ కామెడీ చేస్తున్నారు. మరి వెంకటేష్ సోలోగా హిట్ ట్రాక్ మీదున్నాడు. చైతు మజిలీ తో ఓకె ఓకె అనిపించాడు. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన వెంకటేష్ – చైతు లు మాత్రం వెంకిమామ తో వాళ్ళు అనుకున్న హిట్ అయితే కొట్టలేదనే చెప్పాలి.

Tags:    

Similar News