రెండో రోజు దున్నేసిన మామాఅల్లుళ్లు

చైతు – వెంకీ ల వెంకిమామ సినిమా టాక్ సంబంధం లేకుండా థియేటర్స్ లో దూసుకుపోతుంది. యావరేజ్ టాక్ తోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన వెంకిమామ మొదటి [more]

Update: 2019-12-15 05:26 GMT

చైతు – వెంకీ ల వెంకిమామ సినిమా టాక్ సంబంధం లేకుండా థియేటర్స్ లో దూసుకుపోతుంది. యావరేజ్ టాక్ తోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన వెంకిమామ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లకు పైగా వసూలు చెయ్యగా.. వరల్డ్ వైడ్ గా 8.40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ వీకెండ్ ముగిసేసరికి వెంకిమామ పెట్టిన పెట్టుబడి వెనక్కి తేవడం ఖాయమని, వీక్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ కు చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఇక మొదటి రోజు లాగే రొండో రోజు వెంకిమామ కలెక్షన్స్ వసూళ్ళు ఉన్నాయి. రెండో రోజు వెంకిమామ ఎక్కడా తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెంకిమామ సెకండ్ డే కలెక్షన్స్ 11.83 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 4.41
సీడెడ్ 2.16
నెల్లూరు 0.44
కృష్ణా 0.68
గుంటూరు 1.06
వైజాగ్ 1.57
ఈస్ట్ గోదావరి 0.98
వెస్ట్ గోదావరి 0.53

టోటల్ ఏపీ & టీస్ షేర్ 11.83

Tags:    

Similar News