F2 కామెడీ.. కానీ వెంకిమామ?

ఈ ఏడాది F2 తో అదిరిపోయే హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు నాగ చైతన్య తో కలిసి వెంకిమామ సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజపుట్ తో కలిసి [more]

Update: 2019-11-18 04:49 GMT

ఈ ఏడాది F2 తో అదిరిపోయే హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు నాగ చైతన్య తో కలిసి వెంకిమామ సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజపుట్ తో కలిసి రొమాన్స్ చేస్తున్న వెంకిమామ సినిమాలో చైతు – వెంకటేష్ మామ అల్లుళ్లుగా కనిపిస్తున్నారు. F2 లో వరుణ్ తేజ్ తో కలిసి బ్లాక్ బస్టర్ కామెడీ చేసిన వెంకటేష్ వెంకిమామ లో మాత్రం గుండెలు పిండేసే ఎమోషన్స్ తో అదరగొడతాడని టాక్. వెంకటేష్ మార్క్ కామెడీ ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాడని అంటున్నారు. వెంకటేష్ – నాగ చైతన్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తాజా సమాచారం.

మరి వెంకటేష్ – పాయల్ రాజపుట్ మధ్యన రొమాన్స్ కూడా ఉంటుందని.., చైతు – రాశి ఖన్నా ల కన్నా వెంకీ జోడికి రొమాంటిక్ యాంగిల్ ఎక్కువని యూనిట్ చెబుతున్న మాట. మరి వెంకిమామ రిలీజ్ డేట్ పై కూడా రెండుమూడు రోజుల్లో పక్కా క్లారిటీ వచ్చేలా ఉంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ లో యూనిట్ వేగం పెంచింది. ఇప్పటివరకు వెంకిమామ పై మర్కెట్ లో పెద్దగా బజ్ లేకపోయినా.. ఇపుడు విడుదలవుతున్న సింగిల్స్, ట్రైలర్ తో సినిమా మీద హైప్ పెంచి క్రేజ్ సంపాదించాలని మూవీ టీం భావిస్తోందట

Tags:    

Similar News