దీనిలో కూడా హాటేనా పాయల్

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో వెంకీ మామ మల్టీస్టారర్ ని బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా స్టిల్స్ ఇప్పటికే ఆకట్టుకోగా… ఇప్పుడు థమన్ [more]

Update: 2019-11-15 08:38 GMT

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో వెంకీ మామ మల్టీస్టారర్ ని బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా స్టిల్స్ ఇప్పటికే ఆకట్టుకోగా… ఇప్పుడు థమన్ మ్యూజిక్ అందించిన సింగిల్స్ హడావిడి మొదలైంది. తాజాగా వెంకటేష్ – పాయల్ రాజపుట్ కాంబోలో సాంగ్ సింగిల్ని వదిలారు. ఆ సింగిల్ తో పాటుగా వెంకిమామ స్టిల్ ఒకటి బయటికొచ్చింది. ఆ స్టిల్ లో పాయల్ యదా తదా అన్నట్టుగా అందాల ఆరబోతకు దిగింది. ఇంతకు ముందు RDX లవ్ సినిమాలో అందాల ఆరబోత చేస్తూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించిన పాయల్ రాజపుట్ వెంకిమామ లో అయినా పద్దతిగా కనిపిస్తుందా? లేదంటే సీనియర్ హీరో వెంకటేష్ కి కూడా అందాల ఆరబోతకు దిగుతుందా అనుకున్నారు.

కానీ తాజాగా పాయల్ – వెంకీ ల స్టిల్ చూస్తే మాత్రం పాయల్ రాజపుట్ ఎప్పటిలాగే అందాల ఆరబోత చేస్తుందనిపిస్తుంది. దసరా సందర్భంగా -వదిలిన స్టిల్ లో వెంకటేష్ సరసన చీర కట్టులో ట్రెడిషనల్ గ కనిపించిన పాయల్ రాజపుట్ ఇప్పుడు ఇలా గ్లామర్ షో చేస్తుంది. మరి వెంకిమామలో కూడా పాయల్ అందాలు తనివితీరా చూడడానికి యూత్ అప్పుడే రేడి అవుతున్నారు. కాకపోతే వెంకిమామ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది. ఇప్పటివరకు వెంకిమామ అప్ డేట్ సోషల్ మీడియాలో తప్ప మీడియా లో పూర్తిగా ఎక్కడా వచ్చింది లేదు.

Tags:    

Similar News