ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలి

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. 2019 సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, [more]

Update: 2018-12-31 09:01 GMT

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. 2019 సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పేట సినిమాల హడావిడి స్టార్ట్ అయితే.. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్2 హంగామా మొదలైంది. గత రాత్రి ఎఫ్2 ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సంక్రాతి కానుకగా ఆ సినిమా నిర్మాత దిల్ రాజు విడుదల చెయ్యబోతున్నాడు. తనకి అచ్చొచ్చిన పండగకి సినిమాని విడుదల చేసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఇక వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా ఈ వేడుకకి హాజరైతే.. తమన్నా, మెహ్రీన్ లు ఈ వేడుకకి వేరే కారణాల వలన హాజరవలేదు.

ఆ సినిమాలు గుర్తొస్తాయి…

ఇక ఈ సంక్రాంతికి వెంకటేష్, వరుణ్ హేమాహేమీ హీరోలతో తలపడుతున్నారు. విపరీతమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామతోనే కాకుండా తమిళ చిత్రం పేటతోనూ పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కి భారీ క్రేజుంటే, వినయ విధేయ రామ మీద భారీగా అంచనాలున్నాయి. ఇక సూపర్ స్టార్ రజనీ పేట చిత్రానికి చెప్పక్కర్లేదు. మరి ఈ మూడు భారీ చిత్రాల మీద తమ చిత్రాన్ని వదలడంపై వెంకీ స్పందిస్తూ… తమ సినిమా కామెడీతో కూడిన సినిమా అని, గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లోని నా కామెడీ టైమింగ్ గుర్తుకు వస్తోందని చెప్పాడు.

అన్నీ సక్సెస్ అవ్వాలని…

ఇంకా తమ సినిమాకి పోటీగా విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పేట సినిమాలు హిట్ అవ్వాలని.. బాలయ్య, రామ్ చరణ్, రజనీకాంత్ లు విజయం సాధించాలని ఈ సీనియర్ హీరో వెంకటేష్ కోరుకున్నాడు. మరి సంక్రాతి బరిలో నిలుస్తున్న భారీ సినిమాల విజయాలపై ఆయా చిత్ర బృందాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. చూద్దాం ఏ సినిమా సంక్రాతి విన్నర్ అవుతుందో అనేది!

Tags:    

Similar News