బాలయ్యనా.. వెంకినా…?

ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. యువ హీరోలెవరూ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సీనియర్ హీరోస్ కూడా మొహం చాటేస్తున్నారు. నిన్నమొన్నటి [more]

Update: 2019-04-09 06:37 GMT

ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. యువ హీరోలెవరూ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సీనియర్ హీరోస్ కూడా మొహం చాటేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బాలకృష్ణతో వినాయక్ మూవీ అన్నారు కానీ అది కాస్తా క్యాన్సిల్ అయినట్లుగా కనబడుతుంది. సి.కళ్యాణ్ నిర్మాణంలో వినాయక్ మూవీ క్యాన్సిల్ అయినట్లే. ఎందుకంటే బాలయ్య తన నెక్స్ట్ మూవీని బోయపాటి శ్రీనుతో చేస్తానని అధికారికంగా ప్రకటించాడు. ఇక వెంకటేష్ తో అయినా వినాయక్ సినిమా ఉంటుంది అనుకుంటే ఇప్పుడదీ అయ్యేట్లుగా కనిపించడం లేదు.

బాలయ్యతో ఉంటుందా..?

బాలయ్యతో మూవీ పోయాక.. వెంకీకి కథ చెప్పి ఒప్పించాడనే న్యూస్ నడిచింది. కానీ వెంకటేష్ ప్రస్తుతం వెంకిమామ చేస్తున్నాడు. తర్వాత నక్కిన త్రినాధరావుకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా. ఇక వినాయక్ కి స్పేస్ ఎక్కడుంటుంది. కానీ వినాయక్ మాత్రం తన నెక్స్ట్ సినిమా బాలయ్యతో కానీ లేదంటే వెంకీతో కానీ ఉంటుందని సన్నిహితులతో చెబుతున్నాడట. మరి వినాయక్ కి బాలయ్య ఛాన్స్ ఇస్తాడా ? లేదంటే వెంకినా? అనేది తేలాల్సి ఉంది. కానీ ఏ హీరో ఛాన్స్ ఇచ్చినా వినాయక్ తో సినిమా పట్టాలెక్కించడానికి మాత్రం ఇంకో ఏడాది పట్టడం ఖాయం.

Tags:    

Similar News