వెంకీ కోసం స్క్రిప్ట్ లో మార్పులు

టాలీవుడ్ లో వెంకటేష్ చేసే కామెడీ, ఎమోషనల్ సీన్స్ వెంకీ లో టాలెంట్ ఉన్న సరైన మూవీ పడట్లేదు. ఒకవేళ పడితే బొమ్మ హిట్. ‘ఎఫ్‌2’తో తనకున్న [more]

Update: 2019-01-20 08:57 GMT

టాలీవుడ్ లో వెంకటేష్ చేసే కామెడీ, ఎమోషనల్ సీన్స్ వెంకీ లో టాలెంట్ ఉన్న సరైన మూవీ పడట్లేదు. ఒకవేళ పడితే బొమ్మ హిట్. ‘ఎఫ్‌2’తో తనకున్న కామెడీ టైమింగ్ ఎవరు పోటీ లేరని నిరూపించాడు. వెంకీ కి జోడిగా యంగ్ హీరోను ని జోడిస్తే అది బాక్సాఫీస్‌ వద్ద క్లిక్‌ అయ్యే పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌ అవుతుంది.

మసాలా విషయంలో రిజల్ట్ తేడా కొట్టిన ‘ఎఫ్‌2’ తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు. ఇందులో వెంకీ టోటల్‌గా డామినేట్‌ చేసాడు. అందుకే ఈసినిమా థియేటర్స్ తెగ ఆడేస్తుంది. సినిమా చూసిన ప్రతిఒక్కరు వెంకీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎఫ్‌2 విజయం సాధించడంతో వెంకీ నాగ చైతన్య తో చేస్తున్న ‘వెంకీ మామ’ చిత్రానికి క్రేజ్‌ మరింత పెరిగింది.

అందుకే ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేస్తునట్టు టాక్. ఇందులో వెంకీ కు మరికాస్త ఇంపార్టెన్స్‌ పెంచి..క్యారెక్టరైజేషన్‌లో ఫన్‌ ఫ్యాక్టర్‌ డోస్‌ ఎక్కువ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల సినిమాతో పాటు చైతు కి కూడా అడ్వాంటేజ్ అవుతుందని దర్శకుడు బాబీ భావిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేసి దసరాకి విడుదలయ్యేలా చూస్తున్నారట.

Tags:    

Similar News