ఎన్నాళ్లకో గాని ఇలా జరగదు..!

Update: 2018-10-24 06:43 GMT

గత వారం రామ్ - అనుపమల జంటగా నటించిన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాకి పోటీగా విశాల్ 'పందెం కోడి 2 ' రిలీజ్ అయింది. ఇది డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇలా ప్రతి వారం కచ్చితంగా రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి టాలీవుడ్ లో. అయితే ఈ వారం రిలీజ్ అయ్యే మీడియం రేంజ్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’ కు ఎటువంటి సినిమా పోటీగా లేదు.

ఆసక్తి పెంచిన ట్రైలర్...

నారా రోహిత్-శ్రీవిష్ణు-సుధీర్ బాబు-శ్రియ సరన్‌ ల ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినప్పటికీ సరైనా రిలీజ్ డేట్స్ లేకపోవడంతో ఇప్పటివరకు వెయిట్ చేశారు. కానీ ఈసారి సోలో గా వస్తుంది ఈ చిత్రం. ఇటువంటి అవకాశం దక్కడం చాలా అరుదు. ఈనెల 11న విడుదల అయిన ఎన్టీఆర్ 'అరవింద సమేత' జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ముగిసిందనే చెప్పాలి. అలానే దసరా రోజు విడుదల అయిన 'హలో గురు ప్రేమ కోసమే' యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ రెండు సినిమాల పరిస్థితి అంతగా ఏమి లేదు. దాంతో ఈ వారం రిలీజ్ అయ్యే ‘వీర భోగ వసంత రాయలు’కు కలిసొచ్చేదే. పైగా ఈ సినిమా ట్రైలర్ కూడా జనాల్లో క్యూరియాసిటీ పెంచింది. మరి ఏమి అవుతుందో చూడాలి. సుకుమార్ ఆల్రెడీ ఈ సినిమాను చూసి చాలా బాగుందని కంప్లిమెంట్ ఇచ్చాడు.

Similar News