ప్రీమియర్స్ తో దెబ్బ పడిందిగా..!

Update: 2018-10-26 06:59 GMT

ఫిలిమ్ బ్యాగ్రౌండ్, పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన నారా రోహిత్ డిఫరెంట్ టైటిల్స్ తో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుండేవాడు. హీరో లుక్స్ తక్కువున్నప్పటికీ... నారా రోహిత్ మంచి కథలను నమ్ముకుని కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇక తన స్నేహితుడైన శ్రీవిష్ణు తో కలిసి రెండు మూడు సినిమాల్లో నటించిన నారా రోహిత్ తన సినిమాలకు పెట్టే టైటిల్స్ తోనే సగం క్రేజ్ కొట్టేస్తాడు. ఇక మంచి టైటిల్స్ తీసుకున్నపటికీ.. సినిమాలో ఒక్కోసారి విషయం లేక చతికిల పడడం అనేది రోహిత్ కి అనుభవమే. కానీ నారా రోహిత్ నటించే సినిమాలకు భారీ ఓపెనింగ్స్ లేకపోయినా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక తాజాగా నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కాంబోలో కొత్త దర్శకుడు ఇంద్రసేనా దర్శకత్వంలో వీర భోగ వసంత రాయులు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉన్న సినిమాలో నటించారు.

సినిమాపై నమ్మకంతో...

అయితే సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కలయిక అనగానే ఎంతోకొంత ఆసక్తి అయితే ప్రేక్షకుల్లో ఏర్పడింది. ట్రైలర్, టీజర్ తో కాస్త ఆసక్తిని కలుగజేసిన మేకర్స్ ఎందుకో.. ఈ సినిమాని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్సీస్ లో రెండు రోజుల ముందే ప్రీమియర్స్ అంటూ హడావిడీ చెయ్యడం... అక్కడ ప్రీమియర్స్ వేశాక టాక్ తేడా కొట్టడం.. ఇప్పుడు ఇక్కడ విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. సినిమాకి ఓవర్సీస్ లో నెగెటివ్ టాక్ రావడంతో.. ఇక్కడ వీర భోగ వసంత రాయులకు క్రేజ్ లేక కనీసం టికెట్స్ కూడా అమ్ముడు పోలేదు. ఒక రాత్రి ముందు ప్రీమియర్స్ ఓవర్సీస్ లో పడినప్పటికీ.. ఇక్కడ ప్రీ బుకింగ్స్ తో ఒక వీకెండ్ కి సరిపడా టికెట్స్ అమ్ముడుపోయేవి. కానీ నారా రోహిత్ వాళ్లు సినిమాలో ఏం చూసి ముందుగా ప్రీమియర్స్ అంటూ హడావిడీ చేశారో కానీ.. ఇప్పుడు ఇక్కడ కనీస ఓపెనింగ్స్ మాత్రం రావనే చెప్పాలి. ఏదైనా అక్కడ తొందరపడి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించి ఇక్కడ తీవ్రంగా నష్టపోయారనేది మాత్రం వాస్తవం.

Similar News