వరుణ్ వాల్మీకి… అబ్బో..!!

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ వాల్మీకి అనే చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఆఫీషియల్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ [more]

Update: 2019-04-19 06:40 GMT

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ వాల్మీకి అనే చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఆఫీషియల్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ తన బాడీ ని ఫిట్ గా మార్చడమే కాదు డిఫ‌రెంట్ లుక్ లోకి మారిపోయాడు. పెరిగిన గెడ్డంతో అచ్చం విలన్ లుక్ లో వాల్మీకి గా వరుణ్ తేజ్ లుక్ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వరుణ్ న్యూ లుక్ తో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకుముందెన్నడూ వరుణ్ తేజ్ ఇలాంటి లుక్ ట్రై చేయకపోవడంతో.. ఇప్పుడు ఆ లుక్ కొత్తగా కనబడుతుంది.

వ‌రుణ్ కి హిట్ ఇస్తాడా..?

గడ్డం, చెవి పోగుతో కొత్తగా కనిపిస్తూ మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక వాల్మీకి ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన హరీష్ శంకర్.. వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసాడు. మరి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని మెగా హీరో పవన్ కి అందించిన హరీష్ శంకర్.. వాల్మీకి తో వరుణ్ కి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి.

Tags:    

Similar News