వెంకీ ని వరుణ్ అందుకోగలడా..?

Update: 2018-12-14 06:40 GMT

విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్ లో 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి 'F2' అనే మల్టి స్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. మొన్ననే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఈ సంక్రాంతికి మేమే హిట్ కొట్టేది అని హింట్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్ అనేది తన గత చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది. కేవలం టీజర్ చూస్తూనే సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అయిపోతుంది. ఇందులో వెంకీ - వరుణ్ లు తోడల్లుళ్లుగా నటించారు. పెళ్లికి ముందు మగవాళ్లు ఏమనుకుంటారు.. పెళ్ళైన తర్వాత ఎం తెలుసుకుంటారు అనేది ఈ ఇద్దరితో అనిల్ బాగానే చేయించాడని అర్ధం అవుతుంది. పెళ్లికి ముందు పెళ్లాలతో ఎలా ఉండాలో మాకు తెలుసు అనుకున్న వీళ్లకి ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయో సినిమాలో చూడాలి. వెంకీకి జోడిగా తమన్నా.. వరుణ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు.

తోడల్లుళ్లు ఇరగదీస్తారా..?

కాన్సెప్ట్ పాతదైనా అనిల్ ఏదో ఒక మ్యాజిక్ చేసేసి సినిమాను హిట్ చేసేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. అంతా బాగానే ఉంది కానీ వెంకీ కామెడీ టైమింగ్ విషయంలో వరుణ్ తేజ్ అందుకోగలడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకీ కామెడీని పండించడంలో ఎక్స్ పర్ట్. ఎటువంటి సీన్ ఇచ్చినా అవలీలగా చేసే వెంకీతో వరుణ్ కామెడీ చేయగలడా? అని అంటున్నారు. ఇద్దరూ తోడల్లుళ్లు కాబట్టి.. దాదాపు వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండే అవకాశం ఉంది. పైగా వరుణ్ ఇప్పటివరకు సరైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేయలేదు. అన్ని సీరియస్ పాత్రలు ఉండే సినిమాలే చేసుకొచ్చాడు. మరి వరుణ్ వెంకీని అందుకోగలడా అంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

Similar News