వరుణ్ ను తెగ మెచ్చేసుకుంటున్నారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొదటి నుంచి క్లాస్ సినిమాలతో సావాసం చేసిన వరుణ్ తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ [more]

Update: 2019-09-21 10:46 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొదటి నుంచి క్లాస్ సినిమాలతో సావాసం చేసిన వరుణ్ తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ చేసి అందరిని ఫిదా చేసాడు. మొదటి నుంచి వరుణ్ తేజ్ విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు. ముకుంద చిత్రం తరువాత కంచె తో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసాడు. స్పూర్తిగా నిలిచాడు ఈ మధ్య వచ్చిన అంతరిక్షం మూవీ అతి పెద్ద ప్రయోగంగా చెప్పు కోవచ్చు. చేసింది 10 సినిమాలే అయినా అన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసాడు వరుణ్. ఇక తాజాగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రం చేయడం ఆయన అభిరుచికి నిదర్శనం. ఇందులో కొంచం నెగటివ్ షేడ్ ఉన్నప్పటికీ వరుణ్ చాలా అవలీలగా ఈ పాత్ర చేసేసాడు. పైగా వరుణ్ యాక్టింగ్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. క్లాస్ హీరోగా వెళ్తున్న టైములో సడన్ గా మాస్ సినిమా చేసి మిగతా హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు.

 

Tags:    

Similar News