వరుణ్ తేజ్ సినిమాకు హాలీవుడ్ నిపుణులు

Update: 2018-07-12 08:50 GMT

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హాలీవుడ్ నిపుణులతో...

ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్ పని చేస్తున్నారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైదరీపై 3డీ స్కాన్ చెశారు. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో ఎక్స్ పాండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు.

Similar News