హిట్ కొట్టినా.. క్రెడిట్ దక్కలేదు..!

ఈ సంక్రాంతికి వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 సినిమా ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బంపర్ హిట్ కొట్టింది. చాలా [more]

Update: 2019-01-21 07:54 GMT

ఈ సంక్రాంతికి వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 సినిమా ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బంపర్ హిట్ కొట్టింది. చాలా రోజులకు దిల్ రాజు ఈ సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో.. దిల్ రాజు కంపౌండ్ కళకళలాడింది. అయితే సినిమాని తెరకెక్కించిన అనిల్ రావిపూడికి ఈ సినిమా హిట్ తో మరింత క్రేజ్ పెరిగింది. అలాగే అందరూ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, అలాగే సినిమాని ఒంటిచేత్తో నడిపించిన వెంకటేష్ ల గురించే మాట్లాడుకుంటున్నారు.

వరుణ్ ని గుర్తించరా..?

కానీ ఆ సినిమాలో నటించిన వరుణ్ తేజ్ యాక్టింగ్ గురించి కానీ… ఆ హిట్ లో వరుణ్ కూడా భాగం అనే విషయాన్నీ పెద్దగా మీడియా, ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమాలో వెంకటేష్ తో పోటీ పడకపోయినా వరుణ్ బాగానే నటించాడు. తెలంగాణ భాషను ట్రై చేసినా… ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. వెంకీని బ్రో, కోబ్రా అంటూ బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. ఎఫ్ 2 క్రెడిట్ లో మాత్రం వరుణ్ కి వాటా దక్కనివ్వడం లేదు. కేవలం దిల్ రాజు సూపర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి వరసగా హిట్స్ కొట్టాడు. అలాగే ఈ సినిమాలో వెంకీ వన్ మ్యాన్ షో అంటున్నారు కానీ.. పాపం వరుణ్ తేజ్ ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

Tags:    

Similar News