గోపీచంద్ సినిమా స్టోరీ అదే

ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. అదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు. టాలీవుడ్ లో ఈ మధ్య నాని జెర్సీ వచ్చి మంచి టాక్ [more]

Update: 2019-10-05 07:50 GMT

ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. అదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు. టాలీవుడ్ లో ఈ మధ్య నాని జెర్సీ వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమా తరువాత అంత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ కూడా ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో వరుణ్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు.

త్వరలో యూ టర్న్……

గోపీచంద్ కూడా క్రీడా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం అతను నటించిన చాణిక్య రిలీజ్ అయింది. ఈ సినిమా తరువాత గోపి సంపత్ నంది డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. సమంత తో ‘యు టర్న్’ సినిమా తీసిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. రెండు రోజుల కిందట ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ఇందులో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ కోచ్ గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటించనున్నారని వెల్లడించాడు. ఇది పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని కొన్ని నెలలు పాటు కబడ్డీ కి సంబంధించిన కోచ్ లని కలిసి ఎంతో పరిశోధన చేసి ఈ కథ తయారు చేసినట్లు సంపత్ వెల్లడించాడు.

 

Tags:    

Similar News