బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 3 చివరి మూడు వారాలకు చేరుకుంది. హౌస్ లో 7 గురు కంటెస్టెంట్స్ లో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా చివరి [more]

Update: 2019-10-17 06:42 GMT

బిగ్ బాస్ సీజన్ 3 చివరి మూడు వారాలకు చేరుకుంది. హౌస్ లో 7 గురు కంటెస్టెంట్స్ లో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా చివరి వారంలో ఐదుగురు ఫైనల్ లో ఉంటారు. ఈ వారంలో వితిక కానీ, శివ జ్యోతి కానీ, బాబా భాస్కర్ కానీ బయటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎక్కువగా వితికే ఈ వారం ఎలిమినేట్ అవ్వొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇక టైటిల్ ఫెవరెట్ గా శ్రీముఖి, వరుణ్, రాహుల్ ఉండగా మొదటి నుంచి రాహుల్ ని టార్గెట్ చేసిన శ్రీముఖి మధ్యలో అతని పవర్ చూసి వెనక్కి తగ్గింది. కానీ మళ్ళీ ఎలిమినేషన్ టాస్క్ లో కావాలని రాహుల్ ని రెచ్చగొట్టింది. దాంతో శ్రీముఖి పై కాస్త నెగెటివ్ ఫీలింగ్స్ ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

వారిద్దరి మధ్యే పోటీ…..

ఫైనల్ గా టైటిల్ పోరులో వరుణ్, రాహుల్ మధ్యనే జరిగే అవకాశం కనబడుతుంది. వరుణ్ కూడా పోయిన ఎలిమినేషన్ టాస్క్ లో వితికాను సేవ్ చేసే క్రమంలో మిస్టర్ కూల్ గా ఉండేవాడు కాస్త… జ్యోతి విషయంలో నోరు పారేసుకున్నాడు. మొదటి నుంచి హౌస్ లో జరిగే గొడవలను సర్ది చెబుతూ.. వితికాను కంటెస్టెంట్ గా చూసే వరుణ్ చివరిలో వితికాను భార్యలాగే చూడడం అతనికి నెగెటివ్ ను తెచ్చింది. రాహుల్ కూడా సోలోగా శ్రీముఖి టార్గెట్ ని అడ్డకుంటూ స్ట్రాంగ్ గా నిలబడడంతో ఫైనల్ విన్నర్ గా రాహుల్ నిలుస్తాడని అతనికి ప్రతి వారం పడే ఓట్ల ద్వారా అర్ధమవుతుంది. సో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ అని ఫిక్స్ అవ్వొచ్చు.

 

 

Tags:    

Similar News