టీజర్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

మహర్షి టీజర్ రీసెంట్ గా విడుదలై యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు క్రేజ్ మహర్షి టీజర్ తో మరింత [more]

Update: 2019-04-10 07:57 GMT

మహర్షి టీజర్ రీసెంట్ గా విడుదలై యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు క్రేజ్ మహర్షి టీజర్ తో మరింత ఎక్కువైంది. అయితే టీజర్ ఆదరగొట్టినా విమర్శకులు మాత్రం మహర్షి టీజర్ పట్ల పెదవి విరిచారు. ఇందుకు కారణం మహర్షి సినిమాలో యాక్షన్ సీన్స్, ప్రెస్ మీట్ సీన్స్ అన్నీ చాలా సినిమాల్లో కనిపించినవే.. అందులో కొత్తగా ఏముంది అంటున్నారు. మహేష్ లుక్స్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించి అబ్బరపరిచాడు. కాకపోతే యాక్షన్స్ సీన్స్ లో చాలా సినిమాల పోలికలు బయటపడ్డాయి. అయితే తాజాగా ఈ టీజర్ కట్ పై వంశీ పైడిపల్లి స్పందించాడు.

అందుకే టీజర్ అలా కట్ చేశాం

మహర్షి టీజర్ లో మహేష్ బాబు స్టూడెంట్ గా, బిలియనీర్ గా, ఒక కామన్ మ్యాన్ గా ను మూడు వేరియేషన్స్ లో కనిపించాడు. అయితే తాజాగా వంశీ పైడిపల్లి మహేష్ గెటప్స్ గురించి మాట్లాడుతూ.. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడని విషయం అందరికీ తెలియజేయడానికే టీజర్ ను అలా కట్ చెశామని చెప్పారు. ఇక మహర్షి టీజర్ లో పూజా హెగ్డే, అల్లరి నరేష్ పాత్రలను కావాలనే రివీల్ చెయ్యలేదని.. వారి పాత్రలను అందరూ మెచ్చేలా మరోసారి చూపిస్తామని కూడా చెప్పాడు. మరి ఇప్పటికే మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News