నాకు అదే బిగ్ అఛీవ్ మెంట్

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా వసూళ్లతో దూసుకుపోతుంది. అసలు వంశీ లాంటి తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ [more]

Update: 2019-05-13 08:48 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా వసూళ్లతో దూసుకుపోతుంది. అసలు వంశీ లాంటి తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమే. అతను తీసింది నాలుగు సినిమాలు. అందులో రెండు హిట్ అయ్యాయి. ఒకటి కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇంకోటి ఫ్లాప్ అయ్యింది. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వంశీకి మహేష్ ఛాన్స్ ఇవ్వడం అంటే అది అతనికి పెద్ద అచీవ్ మెంటే. మహేష్ బాబు సినిమా రిలీజ్ తరువాత అతడి హోం థియేటర్లో ‘మహర్షి’ సినిమా మహేష్ తో చూడటం తన జీవితంలో పెద్ద అచీవ్మెంట్‌గా భావిస్తున్నట్లు వంశీ సక్సెస్ ఈవెంట్ లో చెప్పాడు.

ఇదే పెద్ద అచీవ్ మెంట్

ఇద్దరూ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ గురించి మహేష్ గారు నాతో మాట్లాడటం నేను ఎప్పటికీ మర్చిపోలేనని… తనతో మహేష్ గారు ఒక ఎపిక్ మూవీ తీశానంటూ చాలాసార్లు తన భుజం తట్టాడని.. ఇంతకంటే పెద్ద మూమెంట్ తన జీవితంలో మరొకటి లేదని వంశీ అన్నాడు. తనని అతని సోదరుడిలా చూడటం, నన్ను షూటింగ్ సమయం బాగా సపోర్ట్ చేయడం మరువలేనని అన్నాడు వంశీ. సినిమా చూసిన వాళ్లంతా వెళ్లి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసారని వంశీ అన్నాడు. ఇటువంటివి చూసినప్పుడల్లా చాలా గర్వంగా ఉందని తాను అన్నాడు.

Tags:    

Similar News