వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఎవరితో..?

మహర్షి సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న వంశీ జాతకం ఈ మూవీతో మారిపోయింది. ఇతని కోసం చాలామంది హీరోస్, ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు. వంశీతో [more]

Update: 2019-05-16 08:36 GMT

మహర్షి సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న వంశీ జాతకం ఈ మూవీతో మారిపోయింది. ఇతని కోసం చాలామంది హీరోస్, ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు. వంశీతో సినిమా చేసేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే ఫ్యాన్సీ ఆఫర్లు కూడా ఇస్తున్నారట. అలా మోస్ట్ వాంటెడ్ అయిన వంశీ తన నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్ లోనే చేయనున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించి చాన్నాళ్ల కిందటే వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ప్రస్తుతం వంశీ వద్ద కొన్ని లైన్స్ ఉన్నాయట. అవి డెవలప్ చేసే పనిలో ఉన్నాడు.

వంశీతో సినిమా చేయాల‌ని…

ఇక హీరోల విషయానికి వస్తే వంశీకి ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. గతంలో వంశీ చరణ్ తో ఎవడు అనే సినిమా తీసినా అనుభవం ఉండడంతో చరణ్ ఈ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. స్టైలిష్ స్టార్ బన్నీ కూడా వంశీతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. అయితే వీరితో పాటు మరోసారి వర్క్ చేయడానికి మహేష్ కూడా సిద్ధంగా ఉన్నాడట. ప్రస్తుతానికి వంశీకి హీరోస్ తో సమస్య లేదు కాబట్టి సరైన స్టోరీ సెట్ అయితే హీరో ఎవరు అనేది క్లారిటీ వస్తుందని అప్పటిదాకా స్టోరీ మీదే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడని టాక్.

Tags:    

Similar News