వరుణ్ తేజ్ ని ఫూల్ చేస్తారా

వాల్మీకి మరో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎఫ్ 2 తో ఇండస్ట్రీ [more]

Update: 2019-09-17 08:14 GMT

వాల్మీకి మరో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎఫ్ 2 తో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్అందులో వెంకటేష్ షేర్ కూడా ఉంది కాబట్టి సోలో హిట్ తో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. అందుకే సేఫ్ గా రీమేక్ చేస్తున్నాడు. అది కూడా హరీష్ శంకర్ లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ తో. తమిళంలో హిట్ అనిపించుకున్న జిగర్ తండా సినిమాను రీమేక్ చేస్తున్నారు.

క్లైమాక్స్ కీలకం….

రీమేక్ అంటే అచ్చం ఒరిజినల్ లా తీయాలి. కాకపోతే ఇక్కడ క్లైమాక్స్ కీలకం కానుంది. అప్పటివరకు ఒక టెంపో లో నడిచే కథలో చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి హీరో కం విలన్ (ఇప్పుడు వరుణ్ చేసిన పాత్ర) ను ఫూల్ చేయిస్తాడు దర్శకుడు. అక్కడ ఇది బాగా వర్క్ అవుట్ అయింది. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి బాబీ సింహకు అది రెండో సినిమానే కాబట్టి ఇమేజ్ లాంటి ప్రతిబంధకాలు ఏమి లేకపోవడంతో సాఫీగా బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టింది.

ఆ సీన్ ఎలా ఉంటుందో….

కానీ ఇక్కడ వరుణ్ తేజ్ బాబీ సింహ పాత్ర చేస్తున్నాడు. తమిళంలో లానే తెలుగు లో కూడా వరుణ్ పాత్ర ను ఫూల్ చేస్తారా? లేదా? అనేది తెలియాలి. ఒకవేళ ఫూల్ చేస్తే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారా…? అసలే వరుణ్ తేజ్ కి మెగా హీరోస్ ఫ్యాన్స్ అంత సపోర్ట్ ఉంది. చూడాలి హరీష్ శంకర్ ఏం చేసాడో అని.

 

 

Tags:    

Similar News