చిక్కుల్లో వాల్మీకి సినిమా..!

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం వాల్మీకి. రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న టైంలో చిక్కుల్లో పడింది. [more]

Update: 2019-01-30 07:11 GMT

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం వాల్మీకి. రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న టైంలో చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్ పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాల్మీకి టైటిల్ ను ఇటువంటి ఎంటర్ టైన్మెంట్ సినిమాకు వాడటం ఏంటంటూ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సినిమా టైటిల్ లోగోలో గన్ ఉందని… ఈ చిత్రంలో మమ్మల్ని హింసను ప్రేరేపించే వారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉంటే మేము షూటింగ్ జరగకుండా ఆపుతామని చెప్పారు. వెంటనే సినిమా టైటిల్ ని తీసేయాలని హెచ్చరించాడు.

టైటిల్ తొలగించాల్సిందే…

రామాయణాన్ని రాసిన వాల్మీకి పేరుతో ఇలాంటి హింసాత్మక సినిమాలు తీయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంఘం నాయకులు అంటున్నారు. తమను ఇందులో ఫ్యాక్షనిస్టులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. వెంటనే టైటిల్ మార్చకుంటే మాత్రం సీరియస్ చర్యలు ఉంటాయని దర్శకుడు హరీష్ శంకర్ ను సాయి ప్రసాద్ హెచ్చరించాడు. అయితే దీని పై అటు నిర్మాత కానీ ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ రెస్పాండ్ అవ్వలేదు.

Tags:    

Similar News