పవన్ ఫాస్ట్ గా రెడీ అవ్వాలి!!

సినిమాల మీద సినిమాలు చేసేసి.. మల్లి గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లిపోదామనుకున్న పవన్ కళ్యాణ్ కి కరోనా లాక్ డౌన్ పెద్ద అడ్డంకిలా మారింది. పవన్ రీ [more]

Update: 2020-05-24 07:06 GMT

సినిమాల మీద సినిమాలు చేసేసి.. మల్లి గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లిపోదామనుకున్న పవన్ కళ్యాణ్ కి కరోనా లాక్ డౌన్ పెద్ద అడ్డంకిలా మారింది. పవన్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఈపాటికి థియేటర్స్ లో మోతమోగించాల్సి ఉంది. కానీ కరోనా అడ్డం పడింది. చిన్నచిన్న సన్నివేశాల షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయిన వకీల్ సాబ్ ఇప్పుడు ఫాస్ట్ గా అవన్నీ రెడీ చేసుకోవాలి. కొద్దీమంది టీం తోనే చిత్ర సన్నివేశాల పూర్తి చెయ్యాలని.. డిస్టెన్స్ పాటిస్తూనే షూటింగ్ జరుపుకోవచ్చని…వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ లాంటి కార్యకలాపాలు మొదలెట్టుకోవచ్చని తెలంగాణ గవెర్నెమెంట్ చెప్పడంతో.. ఇప్పుడు అందరూ ఆయా కార్యక్రమాల కోసం రెడీ అవుతున్నారు.

అందులో ముందుగా పవన్ వకీల్ సాబ్ ఉంటుందంటున్నారు. వకీల్ సాబ్ కి కొద్దిపాటి షూట్ మాత్రమే మిగలడం, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కాస్త జరగడంతో ముందుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్ళి ఉన్న చిత్రీకరణ పూర్తి చెయ్యాలని చూస్తున్నారట. ఈలోపుగా వేణు శ్రీరామ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ చక్కబెట్టేయ్యాలని చూస్తున్నాడట. మరి కరోనా లాక్ డౌన్ ముగియగానే ముందుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ థియేటర్స్ లోకి దిగేలా కనబడుతుంది. మరి థియేటర్స్ కూడా జూన్ నుండి అయినా జులై = నుండి అయినా తెరుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags:    

Similar News