పవన్ వకీల్ సాబ్ ఆగస్టు కా?

పవన్ కళ్యాణ్ డబ్బులు కోసం మల్లి సినిమాల్లోకి రే ఎంట్రీ ఇస్తున్నా అంటూ వరసబెట్టి సినిమాలు ఒప్పేసుకున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ మల్లి ఎన్నికల సమయానికి పవన్ [more]

Update: 2020-04-08 05:51 GMT

పవన్ కళ్యాణ్ డబ్బులు కోసం మల్లి సినిమాల్లోకి రే ఎంట్రీ ఇస్తున్నా అంటూ వరసబెట్టి సినిమాలు ఒప్పేసుకున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ మల్లి ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఫ్రీ అవుదామనుకున్నాడు. కానీ ప్రస్తుతం పవన్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా కారణముగా పవన్ సినిమాలన్ని ఆగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మే 15 న విడుదల డేట్ ఇవ్వగా.. ప్రస్తుతం కరోనా కారణముగా మే నుండి వకీల్ సాబ్ జూన్ కి షిఫ్ట్ అయ్యింది అన్నారు.

కానీ తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆగష్టు 15 స్వాతంత్య దినోత్సవం రోజుకి వాయిదా పడినట్లుగా సమాచారం. ప్రస్తుతం కరోనా కారణం గా సినిమాలన్నీ వాయిదా పడడంతో పవన్ కళ్యాణ్ సినిమా ఏకంగా ఆగష్టు కి వాయిదా పడింది. దిల్ రాజు అయితే మే లేదా ఆగష్టు అంటూ ముందే ఫిక్స్ అవడం.. కరోనా కారణముగా మే నుండి డైరెక్ట్ ఆగష్టు కి వకీల్ సాబ్ ని షాఫ్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు పక్క గా ప్లాన్ చేసాడంటున్నారు.

Tags:    

Similar News