వకీల్ సాబ్ కోసం పవన్ కేరళ ప్రయాణం!

పవన్ కళ్యాణ్ వరస సినిమాల్తో నిర్మాతలకు మేలు చేస్తున్నాడు. కానీ ఆయన సెట్స్ మీదకెప్పుడు వస్తాడో అనేది క్లారిటీ లేక దర్శకుల్లో టెంక్షన్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ [more]

Update: 2020-12-04 04:46 GMT

పవన్ కళ్యాణ్ వరస సినిమాల్తో నిర్మాతలకు మేలు చేస్తున్నాడు. కానీ ఆయన సెట్స్ మీదకెప్పుడు వస్తాడో అనేది క్లారిటీ లేక దర్శకుల్లో టెంక్షన్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ షూటింగ్ ఓ 20 రోజుల్లో ఫినిష్ అవుతుంది అన్నారు. కానీ మధ్యమధ్యలో పవన్ కళ్యాణ్ ఇచ్చే బ్రేకులకి వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికలంటూ హడావిడి చేసాడు. ఇప్పుడు ఆ ఎన్నికల హడావిడి ముగిసాక ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడ నివార్ తుఫాన్ బాధిత రైతులని, పొలాల పరిశీలనలో ఉన్నాడు. ఇక వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ లిక్విడ్ డైట్ కూడా మొదలు పెట్టాడు.

వేణు శ్రీరామ్ పవన్ ఫాన్స్ కోసం వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాగ్ అద్భుతంగా రాసుకున్నాడట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే  పవన్ బరువు తగ్గుతున్నాడని అంటుంటే.. ఆ కీలక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ శృతి తో రొమాంటిక్ సాంగ్ కూడా ఉండబోతుంది అని అంటున్నారు. శృతి హాసన్ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించబోతుంది. పింక్ సినిమాలో ఇలాంటి డ్యూయెట్స్ ఏముండకపోయినా.. పవన్ హీరోయిజం కోసం కొన్ని మార్పులు చేసిన వేణు శ్రీరామ్ ఫాన్స్ కోసం ఓ సాంగ్ కూడా పెట్టాడట. ఇప్పుడు ఆ సాంగ్ ని చిత్రీకరించడానికి వేణు శ్రీరామ్ పవన్ -శృతి లతో పాటుగా కేరళ వెళ్లనున్నాడని తెలుస్తుంది. అయితే నిహారిక పెళ్లి తర్వాత పవన్ కేరళ ప్రయాణం ఉండబోతున్నట్లుగా సమాచారం. 

Tags:    

Similar News