RX, అర్జున్ రెడ్డి లాంటి కథతోనా

మెగా హీరోలు పుట్టలు పుట్టలుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. ఏడాదికో హీరో చొప్పున మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా వస్తున్నారు. నిన్నగాక మొన్న మెగాస్టార్ చిన్నల్లుడు [more]

Update: 2019-02-05 03:51 GMT

మెగా హీరోలు పుట్టలు పుట్టలుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. ఏడాదికో హీరో చొప్పున మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా వస్తున్నారు. నిన్నగాక మొన్న మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ వస్తే… తాజాగా సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చాడు. సుకుమార్ బ్యాక్ బోన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సుకుమార్ సన్నిహితులు మైత్రి మూవీస్ వారు నిర్మాతలు. ఇక సుకుమార్ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కాస్త మాస్ టచ్ లో రియలిస్టిక్ గా వుండబోతుందట. మరి తోలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో తనదైన ముద్ర వెయ్యడానికి వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడన్నమాట.

అయితే వైష్ణవ్ తేజ్ చెయ్యబోయే సినిమా ఆర్ ఎక్స్ 100, అర్జున్ రెడ్డి మాదిరిగా కాస్త రఫ్ గా వుండేలా సుకుమార్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఫిషర్ మన్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. వైష్ణవ్ తేజ్ సినిమా మొత్తం కోస్తా బెల్ట్ నేఫథ్యంలో వుంటుందని తెలుస్తోంది. అయితే కాకినాడలో జరిగిన ఒక ప్రేమ కథ ఆధారంగా సుకుమార్ ఈ సినిమా కథ ప్రిపేర్ చేసాడని చెబుతున్నారు. యువతకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా కాస్త మాస్ టచ్ ని ఈ ప్రేమ కథకు ఇస్తున్నారని చెబుతున్నారు.

మరి మెగా హీరో వైష్ణవ్ ని సుకుమార్ గట్టిగా హీరో చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇక రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ మాత్రమే కాదు… ఆయన నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాల మీద కూడా భారీ అంచనాలే ఉంటాయి. మరి ఆ అంచనాలు, క్రేజ్ వైష్ణవ్ తేజ్ కి ఏ మేర పనికొస్తాయో చూద్దాం.

Tags:    

Similar News