త్రివిక్రమ్ చేతిలో ఆ హీరోయిన్ కెరీర్

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ పూజ హెగ్డె తో పాటు నివేత పెతురాజ్ కూడా ఒక పాత్రలో నటిస్తుందని అందరికి [more]

Update: 2019-10-18 06:48 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ పూజ హెగ్డె తో పాటు నివేత పెతురాజ్ కూడా ఒక పాత్రలో నటిస్తుందని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ అయిపోయింది. ‘అత్తారింటికి దారేది’ నుంచి మొన్నొచ్చిన ‘అరవింద సమేత’ వరకూ త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కామన్. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్. ఇందులో నివేత పెతురాజ్ సెకండ్ లీడ్ లో కనిపించనుంది.

ఆమె క్యారెక్టరేంటో..?

ఇంతవరకు త్రివిక్రమ్ నివేత క్యారెక్టర్ ఏంటనేది ఎక్కడా రివీల్ చేయలేదు. అసలు ఈ మూవీలో ఈమెది స్కోప్ ఉండే క్యారెక్టరా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా గురూజీ సినిమాలో సెకండ్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇందులో నివేత క్యారెక్టర్ ఏంటో? తెలియడంలేదు. కనీసం టీజర్ లోనో లేదా ఏదైనా క్యారెక్టర్ పోస్టర్ లోనూ నివేత గురించి చెప్తే తప్ప సినిమాలో ఆమెను ఎందుకు తీసుకున్నారనే విషయం బయటికి రాదు. మరి గురూజీ ఏం ఆలోచిస్తాడో చూడాలి. ఇక ఈమూవీ సంక్రాంతి సీజన్ లో 12 న రిలీజ్ అవుతుంది.

 

 

Tags:    

Similar News