లేడి ఓరియెంటెడ్ మూవీస్ కాబట్టే.. పారితోషికం ఎక్కువ!!

తమిళంలో నయనతార చిన్న హీరోలైనా, పెద్ద హీరోలైనా, లేడి ఓరియెంటెడ్ మూవీస్ అయినా.. ఆమెకి అధిక పారితోషికమే. స్టార్ హీరోలతో సమానమైన పారితోషికం నయనతార డిమాండ్ చేస్తుంది. [more]

Update: 2020-08-01 08:52 GMT

తమిళంలో నయనతార చిన్న హీరోలైనా, పెద్ద హీరోలైనా, లేడి ఓరియెంటెడ్ మూవీస్ అయినా.. ఆమెకి అధిక పారితోషికమే. స్టార్ హీరోలతో సమానమైన పారితోషికం నయనతార డిమాండ్ చేస్తుంది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి బెస్ట్ ఆప్షన్ నయనతార కాబట్టే ఆమె అడిగింది ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి విద్య బాలన్ కూడా గత 12 ఏళ్లలో నేను లేడి ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ చేసాను కాబట్టే.. నాకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని ఓపెన్ గానే చెబుతుంది. ప్రస్తుతం విద్య బాలన్ శకుంతలాదేవి బయోపిక్ లో నటించింది. గణితంలో నెంబర్ వన్, హ్యూమన్ కంప్యూటర్ అయినా శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్ ఈ బయోపిక్ లో నటించింది. శకుంతలాదేవి బయోపిక్ ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో విద్యాబాలన్ ఆ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. అందులో భాగమేగానే విద్య బాలన్ పారితోషకం గురించి మాట్లాడింది.

హీరోలకంటే హీరోయిన్స్ కి ఎందుకు తక్కువ పారితోషికం ఇస్తుంటారో.. తన అనుభవాలతో చెప్పుకొచ్చింది. తాను గత కొన్నాళ్లుగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నా అని.. తన అనుభవాలు చాలా చిత్రంగా ఉంటాయని చెబుతుంది. కథానాయక పాత్రలు చేస్తే ఆయా సినిమాల్లో నా పాత్రే గొప్ప. కాబట్టి అందరికన్నా నాకే ఎక్కువ పారితోషికం ఉంటుంది. కొన్నికొన్నిసార్లు సీనియర్ హీరోయిన్ అనే ఉద్దశ్యంతోను భారీ పారితోషికాలు ఇస్తారు. ఇక హీరోలు హైలెట్ అవుతూ హీరో ప్రధానాంశంతో తెరకెక్కే సినిమాల్లో హీరోల పారితోషికాలు అధికంగా ఉంటాయి., అలా పారితోషకాల వివక్ష గురించి మిగతా వారు ఏం అనుకుంటారో నాకు తెలియదు. కానీ చాలా ఏళ్ళ నుండి ఈ లింగ వివక్ష విషయంలో ఆందోళన జరుగుతుంది. నా తరహా సినిమాలు చూసుకున్నా.. హీరోయిన్స్ కి హీరోలకి ఇచ్చే పారితోషికాల్లో తేడాలు ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ విషయం నుండి మనం చాలా దూరం వెళ్లిపోయామంటుంది విద్య బాలన్.

Tags:    

Similar News