ఇన్ సైడ్ టాక్ : ‘‘వి’’ మూవీ సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ కానుందా?

యంగ్ హీరోలు నాని,సుధీర్ బాబు కలిసి నటించిన మూవీ ‘‘వి’’.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు [more]

Update: 2020-08-28 05:01 GMT

యంగ్ హీరోలు నాని,సుధీర్ బాబు కలిసి నటించిన మూవీ ‘‘వి’’.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. అదితి రావు హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటించారు.కరోనా వల్ల ఇంకా థియేటర్లు తెరుచుకోలేని పరిస్ధితి ఉంది కాబట్టి.. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా..హీరోగా సుధీర్ నటిస్తున్నాడు.
టీజర్ విడుదలైనప్పుడు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే అని అనుకున్నారంతా. కానీ ఇందులో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా 6 ప్యాక్ బాడీతో హీరో సుధీర్ బాబు చేస్తున్న ఓ ఫైట్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభం నుండీ అతను ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ‘సమ్మోహనం’ చిత్రంలో సుధీర్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మరో మెట్టు పైకి ఎక్కిన సుధీర్ బాబు… ‘వి’ చిత్రంతో మంచి యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ సుధీర్ బాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందనిపిస్తుంది.

Tags:    

Similar News