ఎన్టీఆర్ ఫాన్స్ కోసం.. ఓ చిన్న అప్ డేట్!!

గత ఏడాది ఎన్టీఆర్ ఆయన తండ్రి హరికృష్ణ మరణంతో పుట్టిన రోజు ని జరుపుకోలేదు. కనీసం ఈ ఏడాద అయినా ఎన్టీఆర్ బర్త్ డే ని గ్రాండ్ [more]

Update: 2020-09-01 08:09 GMT

గత ఏడాది ఎన్టీఆర్ ఆయన తండ్రి హరికృష్ణ మరణంతో పుట్టిన రోజు ని జరుపుకోలేదు. కనీసం ఈ ఏడాద అయినా ఎన్టీఆర్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి.. ఆయన కొత్త సినిమాల అప్ డేట్ కోసం ఎదురు చూసిన ఆయన అభినులకి కరోనా షాకిచ్చింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ RRR లుక్ కూడా విడుదల కాలేదు. అలాగే త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమా అప్ డేట్ కూడా బయటికి రాలేదు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ మూవీ అప్ డేట్ కోసం తెగ ఎదురు చూడడమే కాదు.. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా అప్ డేట్ కోసం నిర్మాతలకు రిక్వెస్ట్ లు పెడుతున్నారట. ఎన్టీఆర్ కోసం తెగ ఎదురు చూస్తున్నాం.. కనీసం అప్ డేట్ అయినా ఇవ్వండి అని అడుగుతున్నారట.

దానితో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగ వంశి ఎన్టీఆర్ ఫాన్స్ రిక్వెస్ట్ లకు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వాలంటూ ఎన్టీఆర్ ఫాన్స్ నుండి సందేశాలు వస్తున్నాయి.. అయితే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ కాంబో షూటింగ్ మొదలైన వెంటనే ఆ సినిమాకి సంబందించిన ఓ బిగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పడమే కాదు.. టైటిల్ విషయమై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్ ని ప్రకటించడం కూడా మాకు సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం. కాబట్టే టైటిల్ ని ప్రకటించకుండా ఆగాము. ఈసారి మాపై నమ్మకం ఉంచండి.. ఓ పెద్ద విషయాన్నీ మీ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నామంటూ నాగ వంశి చేసిన ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది.

Tags:    

Similar News