యు-టర్న్ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Update: 2018-09-14 08:19 GMT

సమంత మెయిన్ లీడ్ లో కన్నడ సూపర్ హిట్ ఫిలిం యూ-టర్న్ సినిమాని కన్నడ యూ-టర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ తెలుగులో రీమేక్ చేసాడు. సమంత మెయిన్ లీడ్ లో, ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా, భూమిక కీలకపాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యూ-టర్న్ సినిమా లోబడ్జెట్ తోనే తెరకెక్కింది. నిన్న వినాయక చవితి కానుకగా.. నాగ చైతన్య శైలాజా రెడ్డి అల్లుడుకి పోటీగా దిగిన యూ-టర్న్ సినిమా పాజిటివ్, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. క్రిటిక్స్ యూ-టర్న్ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వగా... ప్రేక్షకులు కూడా హిట్ టాక్ ఇచ్చారు. అయితే నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడులో కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కడంతో.. ఆ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ బాగున్నాయి. ఇక సమంత యూ-టర్న్ కూడా మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించింది. సమంత నటనలో బెస్ట్ పెరఫార్మెన్స్ తో అదరగొట్టడం.. భూమిక యాక్టింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉండడం, సినిమాటోగ్రఫీ చక్కగా కుదరడం వంటి ప్లస్ పాయింట్స్ తో యూ-టర్న్ హిట్ సాధించింది. ఇక మొదటిరోజు యూ-టర్న్ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్...

నైజాం 0 .35

సీడెడ్ 0.10

ఉత్తరాంధ్ర 0.17

గుంటూరు 0.14

ఈస్ట్ గోదావరి 0.11

వెస్ట్ 0.06

కృష్ణా 0.14

నెల్లూరు 0.03

తెలుగు రాష్ట్రాలు 1.10 కోట్లు

Similar News