డిసెంబర్ వరకు బోర్

టాలీవుడ్ లో గత రెండు నెలల్లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ప్రభాస్ సాహో కాగా, మరొకటి సైరా. ఈ రెండు చిత్రాలు [more]

Update: 2019-10-14 08:12 GMT

టాలీవుడ్ లో గత రెండు నెలల్లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ప్రభాస్ సాహో కాగా, మరొకటి సైరా. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల బడ్జెట్ ఆరువందల కోట్లు కావడం గమనార్హం. ఇక ఇటువంటి భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పటిలో లేనట్టే. మరో రెండు నెలలు వరకు టాలీవుడ్ లో అన్ని చిన్న సినిమాలే. ఈ నెలతో పాటు నవంబర్ నెలలో కూడా కేవలం చిన్న చిత్రాలు మాత్రమే విడుదల అవుతున్నాయి.

విడుదలకు సిద్ధం…..

రాగాల 24గంటల్లో, సాఫ్ట్ వేర్ సుధీర్, మీకు మాత్రమే చెప్తా, ఇద్దరిలోకం ఒకటే, రాహు, ఆవిరి, రాజు గారి గది3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇలా మొత్తం డజనుకు పైగా చిత్రాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. ఇక రవితేజ నటించిన డిస్కో రాజా, వెంకీమామ, పండగ చేసుకో చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఇక సంక్రాంతి సీజన్ లో భారీ చిత్రాలు రిలీజ్ అవ్వనున్నాయి. మహేష్ సరిలేరు నీకెవరు తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, బాలయ్య సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.

 

 

Tags:    

Similar News