ఆ సినిమా దెబ్బకి లైన్ లోకి వస్తున్నారా..?

Update: 2018-11-15 06:35 GMT

ఈమధ్యన బాలీవుడ్ లో బాహుబలి సినిమాని టార్గెట్ గా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు స్టార్ హీరోలు. రాజమౌళి బాహబలి బాలీవుడ్ ని ఆ రేంజ్ లో భయపెట్టింది మరి. తెలుగు ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి మీద పంతంతో భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కించిన మూవీస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఎలాగైనా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలనే కసితో ఉన్నారు కానీ... కంటెంట్ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. చైనా వంటి దేశాల్లో తిరుగులేని అమీర్ ఖాన్ థగ్స్ అఫ్ హిందూస్తాన్ సినిమా బాహుబలిని టార్గట్ చేసిన సినిమానే. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కి మట్టి కరిచింది.

బాహుబలికి పోటీగా తెలుగులోనే...

అయితే తాజాగా టాలీవుడ్ లోనూ బాహుబలిని తలదన్నే రీతిలో ప్రభాస్ హీరోగా సాహో సినిమా సుజిత్ దర్శకత్వంలోని, చిరు హీరోగా సై రా నరసింహారెడ్డి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్నాయి. బాహుబలికైన ఖర్చుతో పోలుస్తూ ఈ రెండు సినిమాల నిర్మాతలు ఆ సినిమాలకు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అలాగే బాహుబలి మాదిరిగానే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ మర్కెట్స్ ని దృష్టిలో పెట్టుకుని సాహో నిర్మాతలు, సైరా నిర్మాతలు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక బాహుబలికి ఏ మాత్రం తగ్గని యాక్షన్ తో సినిమాలను రెడీ చేస్తున్నారు కూడా.

బడ్జెట్ కాదు... నచ్చేలా తీయాలి...

కానీ థగ్స్ అఫ్ హిందుస్తాన్ చూశాక.. తమ సినిమాలో యాక్షన్, భారీ బడ్జెట్ కంటే... అందరూ మెచ్చే కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారట. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలకు టాక్ తేడా కొడితే... తెలుగులో ఏమో గాని తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాకి కలెక్షన్స్ రావడం కల. అందుకే సైరా సినిమాని, సాహో సినిమాని ఎటువంటి హడావిడి పడకుండా నీట్ గా తెరకెక్కించి.. అందరి అంచనాలు అందుకునేలా రెడీ చెయ్యాలని.. విడుదల లేట్ అయినా పర్లేదు కానీ... అందరూ మెచ్చేలా ఉండాలనే నిశ్చయానికి వచ్చారట.

Similar News