ఫ్రెండ్షిప్ కోసం త్రివిక్రమ్ అలా చేశాడా?

సునీల్ హీరోగా అవకాశాలు తగ్గాక అటు విలన్ గాను, ఇటు కమెడియన్ గాను సక్సెస్ అవడానికి నానా పట్లు పడుతున్నాడు. కమెడియన్ గా సక్సెస్ కాలేకపోయాడు. మరోపక్క [more]

Update: 2020-10-11 08:06 GMT

సునీల్ హీరోగా అవకాశాలు తగ్గాక అటు విలన్ గాను, ఇటు కమెడియన్ గాను సక్సెస్ అవడానికి నానా పట్లు పడుతున్నాడు. కమెడియన్ గా సక్సెస్ కాలేకపోయాడు. మరోపక్క సునీల్ విలన్ గా నటించిన కలర్ ఫోటో విడుదలకు ముస్తాబు అవుతుంది. అయితే హీరోగా అవకాశాలు తగ్గాక సునీల్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ నే నమ్ముకున్నాడు. త్రివిక్రమ్ కూడా తన రెండు సినిమాల్లో సునీల్ కి మంచి కేరెక్టర్ ఇవ్వలేకపోయాడు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు ఫ్రెండ్ సునీల్ కోసం ఓ పని చేసాడని.. ఆ పని తెలిస్తే అందరూ షాకవ్వల్సిందే అంటున్నారు.

అదేమిటంటే త్రివిక్రమ్ సునీల్ కోసం మరో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాలో ఓ పాత్ర కోసం బన్నీ దగ్గరకి వెళ్లి పాన్ ఇండియా మూవీ పుష్ప లో ఓ పాత్ర సునీల్ కి ఇవ్వమని… ఈ విషయంపై సుకుమార్ తో మాట్లాడమని.. బన్నీని రిక్వెస్ట్ చేసినట్లుగా సినీవర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బన్నీ కూడా త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని సుకుమార్ ముందుంచగా…. సుకుమార్ అటు బన్నీ మాట తీసెయ్యలేక పుష్ప లో ముందు అనుకున్న ఓ నటుడిని తప్పించి మరీ సునీల్ కి అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. అయితే త్రివిక్రమ్ చెప్పాడు కాబట్టే బన్నీ.. సుకుమార్ తో మాట్లాడాడట. లేదంటే సుకుమర్ ముందు అనుకున్న నటుడే ఆ పాత్రకి పర్ఫెక్ట్ అట. కానీ అల్లు అర్జున్ చెప్పాక బావుండదని పుష్ప లో ఆ పాత్రని సునీల్ కి వచ్చేలా సుకుమార్ చేసాడట. సుకుమార్ చేతిలో పని గనక జారిపోయింది. లేదంటే లేదు. మరి సునీల్ కోసం త్రివిక్రమ్ ఇలా చెయ్యడం చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే.

Tags:    

Similar News