వాళ్లే హీరోలా? మిగిలిన వాళ్లు కాదా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు [more]

Update: 2018-12-29 08:55 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్టార్ సిండ్రోమ్ ఉన్నట్టు ఉంది. అంటే స్టార్స్ తో తప్ప మీడియం రేంజ్ హీరోస్, చిన్న హీరోస్ తో సినిమాలు చేయకపోవడం. సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలి..కథ లు కూడా వారి కోసమే రాసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. తను డైరెక్టర్ అయినప్పుడు మొదట ‘నువ్వే నువ్వే’ తరుణ్ తో ..2016 లో అ ఆ చిత్రం తో నితిన్ తో తప్ప త్రివిక్రమ్ మీడియం రేంజ్ హీరోస్ తో స్టార్ ఇమేజ్ లేని హీరోస్ తో సినిమాలు చేయలేదు.

వెంకటేష్ తో సినిమా ఏదీ?

స్టార్ ఉంటేనే సినిమా లేకపోతే మనం స్టార్ లేకుండా పోతాం అనే సూత్రాన్ని గురూజి బాగా వంటబట్టించుకున్నట్లు కన్పిస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని పేపరల్లో యాడ్స్ లో వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని యాడ్స్ వచ్చాయి. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వబోతుందని వార్తలు వచ్చాయి. ఏడాది దాటిపోయింది ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా లేదు.

చిరంజీవితో….

స్టార్ ఇమేజ్ అంతగా లేని వెంకీ ని కాదని త్రివిక్రమ్ చిరంజీవి తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ తన కెరీర్ స్టార్టింగ్ లో తన డైలాగ్స్ కి ప్రాణం పోసిన వెంకటేశ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్ ఇచ్చేశాడన్నమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ త్రివిక్రమ్ గారూ…. స్టార్ అయితేనే సినిమానా? లేకపోతే సినిమా లేదా? చూద్దాం కనీసం చిరు తరువాత అయినా వెంకీ తో సినిమా చేస్తాడేమో.

Tags:    

Similar News