త్రివిక్రమ్ రియలైజ్ అయ్యాడండోయ్..!

త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు ఆశించేది కామెడీ. అటువంటి కామెడీ లేకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే అరవింద సమేతలో త్రివిక్రమ్ కామెడీ [more]

Update: 2019-02-25 06:17 GMT

త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు ఆశించేది కామెడీ. అటువంటి కామెడీ లేకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే అరవింద సమేతలో త్రివిక్రమ్ కామెడీ జోలికి పోకుండా కేవలం సీరియస్‌ డ్రామాని మాత్రమే పండించాడు. అందుకే ఈ మూవీ ఓవర్సీస్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. సునీల్ లాంటి స్టార్ కమెడియన్ ని పెట్టి సీరియస్ డ్రామాని నడిపించాడు. అలానే తెలుగు స్టేట్స్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రమే వచ్చి యావరేజ్ గా నిలిచింది.

మళ్లీ కామెడితో…

అందుకే ఇప్పుడు తన సినిమాల్లో ఏమున్నా లేకపోయినా కామెడీ మస్ట్ అండ్ షుడ్ అని రియలైజ్ అయ్యి అల్లు అర్జున్ సినిమాలో కామెడీ పార్ట్‌ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంట.ఇందులో సునీల్ పాత్ర చాలా కామెడీని పండిస్తుందని… త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగా ఈ సినిమాలో కూడా కామెడీ ఉండబోతుంది అని ఇన్సైడ్ టాక్. మొదట చాలా వెర్షన్స్ విన్న బన్నీ లాస్ట్ కి ఓ వెర్షన్ ని ఫైనల్ చేసాడు. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.

Tags:    

Similar News