సందీప్ వంగా ప్లేస్ లో త్రివిక్రమ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మే 9న వరల్డ్ వైడ్ గా [more]

Update: 2019-05-05 12:08 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఇంకా ఈ మూవీ టైటిల్ కంఫర్మ్ చేయలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీ తరువాత మహేష్ తన 27వ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగాతో గీత ఆర్ట్స్ నిర్మాణంలో ఉంటుందని అందరూ అనుకున్నారు.

ఇద్ద‌రి కాంబోలో మూడో సినిమా…

కానీ మధ్యలో త్రివిక్రమ్ వచ్చేలా ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యేలోపు మహేష్ తన 26వ సినిమా చివరి అంకంలో ఉంటుంది. ఆ గ్యాప్ లో త్రివిక్రమ్.. మహేష్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేసే పనిలో ఉంటాడు. రీసెంట్ గా మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి ఒక యాడ్ కి పని చేశారు. అప్పుడే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక‌ ప్రకటన వచ్చే వరకు నమ్మలేం. ఒకవేళ ఇది నిజమైతే వీరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా అవుతుంది.

Tags:    

Similar News