త్రివిక్రమ్ - బన్నీ సినిమా కోసం టీ సిరీస్ మాస్టర్ ప్లాన్!

Update: 2018-10-28 08:52 GMT

బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫుల్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. హిందీలో ఓ సినిమా లైన్ ను తీసుకుని త్రివిక్రమ్ దాన్ని తన స్టైల్ లో మార్చి ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఎందుకు వచ్చిందిలే అని ఆ హిందీ సినిమా రైట్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యారట టీం. అయితే ఆ సినిమాను నిర్మించిన టీ సిరీస్ వారు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారట.

లైన్ వాడాలంటే....

లైన్ కొద్దిగా వాడుకోవాలంటే భాగస్వామ్యం ఇవ్వడమా? అందుకు నో అనే అంటున్నారు గీతా ఆర్ట్స్ వారు. లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఇటు గీతా వర్గాలు కానీ, అటు హారిక హాసిని వర్గాలు కానీ పూర్తిగా నిరాసక్తతతో వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ సిరీస్ ను హక్కుల విక్రయం కోసం ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. కానీ పక్షంలో వేరే కథతోనే ముందుకు వెళ్లే ఆలోచనే త్రివిక్రమ్ లో వుందని తెలుస్తోంది.

రెండు రోజుల్లో......

మరో రెండు రోజుల్లో ఏ విషయమో తేలనుంది. ఒకవేళ డీల్ సెట్ అవ్వకపోతే త్రివిక్రమ్ - బన్నీ వేరే కథకు వెళ్లే అవకాశముందని తెలుస్తుంది. వేరే కథ అయితే ఈ ప్రోజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. అంటే బన్నీ సినిమా కోసం తన ఫ్యాన్స్ ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిఉంటుంది.

Similar News