త్రివిక్రమ్ అటు..బన్నీ ఇటు..ఎవరు గెలుస్తారు..?

Update: 2018-12-15 06:27 GMT

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎప్పటినుండో ఓ సినిమా వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు దానికి లైన్ క్లియర్ అవ్వలేదు. హిందీలో ఓ సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ తెలుగు వాళ్లు దాన్ని ఒప్పుకోరేమో అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ లో అసలు సినిమా ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కు ఒక లైన్ వినిపించాడంట. అల్లు అర్జున్ కి లైన్ నచ్చడంతో వెంటనే గీతా ఆర్ట్స్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అడ్వాన్స్ ఇప్పించే ప్రయత్నం చేసాడట. కానీ త్రివిక్రమ్ గీత ఆర్ట్స్ నుండి వచ్చే అడ్వాన్స్ ని వద్దు అని హారిక హాసిని వాళ్లు ప్రొడ్యూసర్స్ గా ఉంటేనే సినిమా చేస్తానని కండిషన్ పెట్టాడట.

జనవరిలో ప్రారంభం...

హారిక హాసిని బ్యానర్ ని త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ లా ఫీల్ అవుతాడు. గత కొంత కాలం నుండి త్రివిక్రమ్ ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ సినిమా అదే బ్యానర్ లో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆలా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ లో చేయాలనీ.. త్రివిక్రమ్ ఏమో హారిక హాసినిలో చేయాలనీ కూర్చున్నారు. మరి వీరిలో ఎవరు దిగి వస్తారో చూడాలి. జనవరిలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగి.. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Similar News