త్రివిక్రమ్ కు థాంక్స్ చెప్పాల్సిందే..!

Update: 2018-09-22 06:19 GMT

అచ్చమైన తెలుగు పదాలతో హాస్యన్ని పడించడంలో త్రివిక్రమ్ రూటే సెపరేట్. ఆయన సినిమాల్లో నటీనటులతో తెలుగులో ఆయన చెప్పించే డైలాగ్స్ మరే దర్శకుడు చెప్పించడంటే నమ్మండి. ప్రస్తుతం త్రివిక్రమ్... ఎన్టీఆర్ హీరోగా ‘‘అరవింద సమేత వీరరాఘవ” అనే సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని దసరాకు కానుకగా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ రకమైన యాసతో మాట్లాడించారు. ‘‘అరవింద సమేత”లో ఎన్టీఆర్ తో చాలా వరకూ కడప, రాజాంపేటలో మాట్లాడుకునే యాస వినిపించబోతుంది. ఆ భాష ఎలా ఉంటుందో మనం టీజర్ లోనే చూసేసాం. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ లో రెండు పాటలు ఏకంగా అదే యాసలో పెట్టారు.

త్రివిక్రమ్ ది నిజంగా ధైర్యం..

ఇదివరకు రాయలసీమ నేపధ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో యాస కూడా వినిపించింది. అయితే పాటల్లో యాస పెట్టె దైర్యం మాత్రం ఎవరు చేయలేదు. కానీ త్రివిక్రమ్ అది చేసాడు. ఆల్బంలో సూపర్ హిట్ గా నిలిచినా ‘పినిమిటి’ పాట కడప యాసలోనే వుంది. అలాగే 'రెడ్డి ఇక్కడ సూడు’ పాట కూడా అదే విధంగా ఉంది. ఒకపక్క తెలుగును మరిచిపోతున్న టైంలో త్రివిక్రమ్ ఈ సినిమాతో తెలుగు భాషలో వుండే వైవిధ్యం చూపడమే కాదు యాసలో ఉండే అందం గురించి కూడా చెబుతున్నారు.

Similar News