సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న త్రివిక్రమ్

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫామిలీ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి [more]

Update: 2019-07-25 08:21 GMT

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫామిలీ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న ఈసినిమా లో ఓ ముఖ్య పాత్ర లో సీనియర్ నటి టబు నటిస్తుంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో పాల్గొనున్నారు.

తల్లి పాత్రలను పవర్ ఫుల్ గా….

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్ర విజయం తరువాత నుండి తన చిత్రాలలో ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ చుట్టూ కథ రాసుకుంటున్నారు. ఈమూవీ తరువాత అ ఆ చిత్రం లో నదియా తో మహాలక్ష్మి అనే పాత్ర చేయించాడు. అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ పవన్ కు తల్లి గా చేసింది.

సిస్టర్ సెంటిమెంట్…..

అయితే బన్నీ సినిమాలో టబు అత్త పాత్రే చేస్తుంది. త్రివిక్రమ్ ఈసినిమాను సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. బన్నీ కి సిస్టర్ పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది.అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలలో అత్త ఎంత హైలైట్ అయిందో అదేవిధంగా ఈచిత్రంలో కూడా టబు అంతే హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈమూవీలో హీరో సుశాంత్, నవదీప్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News