మరోసారి త్రివిక్రమ్ తన రొటీన్ ఫార్ములానేనా?

Update: 2018-05-22 08:49 GMT

త్రివిక్రమ్ సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అ..ఆ', 'సన్నాఫ్ సత్యమూర్తి' చూసుకుంటే అయన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కామన్ గా ఉంటుంది. లేటెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'లో కూడా సెకెండ్ హీరోయిన్ ఉంది. అయితే త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ 'అరవింద సమేత' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ ప్రస్తావన లేకపోయే సరికి చాలామంది ఆశ్చర్యపోయారు.

రెండో హీరోయిన్ గా ఈషా రెబ్బా...

కానీ త్రివిక్రమ్ మాత్రం ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ని పెట్టాడు. 'అరవింద సమేత' లో పూజా హెగ్డే హీరోయిన్ అని మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇంకా రెండో హీరోయిన్ గా ఈషా రెబ్బాను తీసుకున్నారు. అయితే త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించనున్నారంట. ఈషా రెబ్బా 'అమీ తుమీ', 'అ!' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది. ఈ సినిమాలో ఆమె నటన, లుక్స్ కు మంచి కాంప్లిమెంట్స్ రావడంతో ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కథ పరంగా ఫ్లాష్ బ్యాక్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ లో ఈషా కనిపిస్తుందట.

Similar News