రామ్ – త్రివిక్రమ్ – ఓ గాసిప్?

ఎన్టీఆర్ RRR షూటింగ్ తో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ తో తో పనిచెయ్యబోయే త్రివిక్రమ్ చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అందుకే ఈలోపు మరో  సినిమా చేసినా [more]

Update: 2020-11-05 04:43 GMT

ఎన్టీఆర్ RRR షూటింగ్ తో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ తో తో పనిచెయ్యబోయే త్రివిక్రమ్ చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అందుకే ఈలోపు మరో  సినిమా చేసినా చెయ్యొచ్చు అంటూ ప్రచారం జరగడం మధ్యలో మహేష్ బాబు త్రివిక్రమ్ తో మూవీ ఉంటుంది అని కన్ఫర్మ్ చెయ్యడంతో.. మహేష్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కన్నా ముందు ఉంటుంది అన్నారు. తర్వాత త్రివిక్రమ్ ఓ చిన్న హీరోతో కమిట్ అవుతున్నాడని..  అది కూడా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన రామ్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఇక రామ్ అయితే త్రివిక్రమ్ తో జులాయి లాంటి సినిమా చెయ్యాలని అలాంటి కథతో మనం సినెమా చేద్దామని చెప్పినట్టుగా చెప్పారు. మరి ఎప్పుడూ స్టార్ హీరోల చుట్టూ తిరిగే త్రివిక్రమ్ ఆ మధ్యన నితిన్ అ…ఆ సినిమా చేసాడు. అలానే రామ్ తో త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంటుంది అనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేవరకు త్రివిక్రమ్ వేచి చూస్తాడు కానీ… మరో హీరోతో కమిట్ అయ్యే అవకాశం లేదంటున్నారు. మరోపక్క రామ్ రెడ్ సినిమా విడుదల విషయంలో కాస్త టెంక్షన్ లో ఉంటే.. ఇటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా విషయంలో బిజీగా ఉన్నాడు. కానీ మధ్యలో రామ్ – త్రివిక్రమ్ కాంబో అంటూ ప్రచారం జరిగింది కేవలం రూమరే కానీ అందులో నిజం లేదని అంటున్నారు.

Tags:    

Similar News