త్రివిక్రమ్ తో పెట్టుకుంటే....?

Update: 2018-04-13 10:44 GMT

జై లవ కుశ సినిమా గత ఏడాది దసరాకి వచ్చి హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ మొదలు పెట్టాడు. ఎప్పటినుండో ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనే ఆశ ఇన్నాళ్లకు తీరనుంది. అయితే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆరు నెలలకి ఇప్పటికి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా సెట్స్ మీదకెళ్లింది. అయితే ఈ మధ్యలో ఎన్టీఆర్ జిమ్ లో కుస్తీలు పడుతూ కొవ్వు కరిగించగా... త్రివిక్రమ్ మాత్రం అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ తో చాన్నాళ్లుగా అజ్ఞాతవాసంలోనే గడుపుతూ ఎవరికి అందుబాటులో ఉండకుండా ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు.

ఈరోజు సెట్స్ మీదకు....

ప్రస్తుతం ఈ రోజు శుక్రవారం అధికారికంగా సెట్స్ మీదకెళ్ళిన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా రామోజీ ఫిల్మ్‌సిటీలో మొద‌లైంది. ఇప్పటికే ప‌లు వాయిదాలు ప‌డిన ఈ సినిమా షూటింగ్ ఇక‌పై శ‌ర‌వేగంగా జరగనుందని.. ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం. సినిమా మొదలైన వెంటనే రామ్ - లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్స్ సన్నివేశాలతో మొదలు పెట్టుకున్న ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ ఏడాది దసరాకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని షూటింగ్ అధికారికంగా మొదలైందని అలాగే ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా 2018 దసరా విడుదల అని ఒక పోస్టర్ విడుదల చేసింది హారిక హాసిని నిర్మాణ సంస్థ.

సమయానికి విడుదలవుతుందా?

మరి ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ స్టయిలిష్ గా కనబడుతుండగా... అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శనం దొరికింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మరో ఫొటోలో హారిక హాసిని నిర్మాత చినబాబుతో పాటు త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు ఉన్నారు. మరి రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా త్రివిక్రమ్ సినిమాని ఆఘమేఘాల మీద పూర్తి చెయ్యడానికి సన్నద్ధం అవుతున్నాడు. అయితే త్రివిక్రమ్ తో చెప్పినంత ఈజీ కాదు విడుదల సమయానికి సినిమాని విడుదల చెయ్యడం. చూద్దాం ఏం జరుగుతుందో.

Similar News